West Godavari: అగ్నిమాపక వారోత్సవాలు: భీమవరంలో 4వ రోజు కార్యక్రమాలు విజయవంతం!

West Godavari: భీమవరంలో అగ్నిమాపక వారోత్సవాలు. తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు, బస్సు డ్రైవర్లకు అవగాహన.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 18 April 2026 12:48 PM IST
West Godavari
X

West Godavari: అగ్నిమాపక వారోత్సవాలు: భీమవరంలో 4వ రోజు కార్యక్రమాలు విజయవంతం!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అగ్నిమాపక కేంద్రం నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా భీమవరం పట్టణంలోని తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్‌లో విద్యార్థులు, సిబ్బంది మరియు బస్సు డ్రైవర్లకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వివరించారు. అదేవిధంగా గ్యాస్ ఫైర్ డెమోలు, వాటర్ ఫైర్ డెమోలు నిర్వహించి, అగ్నిమాపక పరికరాలను సరిగ్గా ఎలా వినియోగించాలో ప్రాయోగికంగా చూపించారు. కార్యక్రమం అనంతరం కరపత్రాలు పంచుతూ, గోడ పత్రికలు అంటించడం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం ద్వారా అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం మరియు భద్రతా చర్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి బి.శ్రీనివాస రావు, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి కే.శ్రీనివాస రావు మరియు భీమవరం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story