Alla Nani: మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత

Alla Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు.

Arun Chilukuri
Updated on: 15 Sept 2026 3:30 PM IST
Alla Nani
X

Alla Nani: మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత

Alla Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుంచి ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి విజయం సాధించారు.

ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మరియు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

వైఎస్సార్సీపీకి దూరమైన అనంతరం, కొద్ది నెలల క్రితం ఆయన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.