Vizianagaram: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బొత్స ఝాన్సీ
Vizianagaram: విజయనగరం కోరాడ వీధిలోని శ్రీ మరిడమ్మ తల్లిని మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి దర్శించుకున్నారు.
Vizianagaram: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బొత్స ఝాన్సీ
Vizianagaram: విజయనగరం కోరాడ వీధిలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారిని విజయనగరం మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ ఈరోజు దర్శించుకున్నారు.
లోక కళ్యాణార్థం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, "చల్లదనాల" పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి చద్ది నైవేద్యాలను సమర్పించి, రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలతో పాడిరిల్లుతూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు విరాజిల్లాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ యువర్ణ కుమార్ స్వామి , ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Next Story




