Saikrishna Missing Case: సస్పెండైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్!
Saikrishna Missing Case: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండయిన కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Saikrishna Missing Case: సస్పెండైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్!
Saikrishna Missing Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే సస్పెండయిన కృష్ణలంక సీఐ (CI) నాగరాజును ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం సిట్ అధికారులు ఈ యాక్షన్ తీసుకున్నారు. అయితే, సీఐ అరెస్ట్ సమాచారం తెలియడంతో ఆయన నివాసానికి మద్దతుదారులు భారీగా తరలివచ్చారు.
సిట్ అధికారులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలిస్తున్న క్రమంలో తీవ్ర హైడ్రామా నడిచింది. సీఐ మద్దతుదారులు, స్థానికులు పెద్ద ఎత్తున సిట్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కాకుండా, "మాకు రక్షణ మీరే" అంటూ సీఐ నాగరాజుకు, పోలీసు వ్యవస్థకు అనుకూలంగా నినాదాలు చేయడం ఇక్కడ గమనార్హం. మద్దతుదారులు పోలీసు వాహనాన్ని కదలనివ్వకపోవడంతో సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. మద్దతుదారులను చెల్లాచెదురు చేసి, సీఐ నాగరాజును సురక్షితంగా సిట్ కార్యాలయానికి తరలించారు. సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఇందులో సీఐ నాగరాజు పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో సిట్ అధికారులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. ఈ అరెస్ట్‌తో సాయికృష్ణ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.




