Garividi: గరివిడిలో పార్టీ శ్రేణులతో బొత్స అనూష, సందీప్ భేటీ
Garividi: చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి క్యాంప్ కార్యాలయంలో క్లస్టర్, డివిజన్ ఇంచార్జ్‌లతో డా. బొత్స అనూష, డా. బొత్స సందీప్ సమావేశమయ్యారు.
Garividi: గరివిడిలో పార్టీ శ్రేణులతో బొత్స అనూష, సందీప్ భేటీ
Garividi: శాసన మండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గరివిడి క్యాంప్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల క్లస్టర్, డివిజన్ ఇంచార్జ్‌లతో యువ నాయకురాలు డా. బొత్స అనూష , యువ నాయకులు డా. బొత్స సందీప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. బొత్స అనూష, డా. బొత్స సందీప్ మాట్లాడుతూ..
మీ అందరి కష్టం, నిబద్ధత వల్లనే మన పార్టీ గ్రామ స్థాయిలో బలంగా నిలుస్తోంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీకి ఒక బలమైన స్తంభం. రాబోయే రోజుల్లో మనమంతా ఐక్యంగా పనిచేసి, ప్రజల్లో ఉంటూ పార్టీ విజయానికి కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం” అని పిలుపునిచ్చారు.
అనంతరం మండలంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, గ్రామ స్థాయి కమిటీల నిర్మాణంపై ఇంచార్జ్‌లతో విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కృష్ణం నాయుడు, శ్రీరాములు, అప్పారావు, యలకల అప్పల నాయుడు మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




