NTR District: సిలిండర్ కోసం క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షణ
NTR District: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని శ్రీ దుర్గా గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు భారీగా క్యూ కట్టారు.
NTR District: సిలిండర్ కోసం క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షణ
NTR: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో గ్యాస్ వినియోగదారుల కష్టాలు తీరడం లేదు. స్థానిక శ్రీ దుర్గా గ్యాస్ ఏజెన్సీ (HP Gas) వద్ద మంగళవారం ఉదయం నుంచే వినియోగదారులు సిలిండర్ల కోసం భారీగా క్యూ కట్టారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని రోజుల తరబడి ఎదురుచూస్తున్నా, ఇంటికి డెలివరీ రాకపోవడంతో చేసేదేమీ లేక వినియోగదారులే నేరుగా ఏజెన్సీ వద్దకు తరలివచ్చారు.
గ్యాస్ బుక్ చేసి వారం దాటినా సిలిండర్ రావడం లేదు. ఏజెన్సీకి వస్తే ఇక్కడ భారీ క్యూ ఉంది. మా పని వదులుకుని గంటల తరబడి ఇక్కడే వేచి ఉండాల్సి వస్తోంది అంటూ వినియోగదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు మండిపడుతున్నారు.
Next Story




