Giddalur: లిఫ్ట్ అడిగి ఎక్కింది.. చివరకు హనీట్రాప్‌లో దింపింది!

Giddalur: గిద్దలూరు పట్టణంలో ఓ మాజీ సైనికుడిని మహిళ హనీట్రాప్‌లోకి దింపి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 14 Nov 2026 12:40 PM IST
Giddalur: లిఫ్ట్ అడిగి ఎక్కింది.. చివరకు హనీట్రాప్‌లో దింపింది!
X

Giddalur: లిఫ్ట్ అడిగి ఎక్కింది.. చివరకు హనీట్రాప్‌లో దింపింది!

Giddalur: గిద్దలూరు పట్టణంలో ఓ మహిళ హనీట్రాప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్ అడిగే నెపంతో పరిచయం పెంచుకున్న ఒక మహిళ, మాజీ సైనికుడిని వలపు వలలోకి దింపి లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే?

గిద్దలూరు పట్టణానికి చెందిన ఒక మాజీ సైనికుడు ఈ నెల 9వ తేదీన తన ద్విచక్రవాహనంపై పీఆర్‌ కాలనీ నుంచి పట్టణంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ మహిళ అతన్ని లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కింది. ఆ తర్వాత మాటలు కలిపి అతన్ని తన వలపు వలలోకి (Honey Trap) దించింది. అనంతరం ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ మాజీ సైనికుడిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

రూ. 1.50 లక్షల డిమాండ్.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ ఆ మహిళ తీవ్ర బెదిరింపులకు దిగింది. అంతటితో ఆగకుండా తనకు రూ. 1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. పరువు పోతుందన్న భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు తన ఫోన్‌పే ద్వారా సుమారు రూ. 7 వేలు ఆ మహిళ ఖాతాకు పంపించినట్లు తెలిసింది.

అయితే, ఆమె వేధింపులు మరింత ఎక్కువ కావడంతో తాను హనీట్రాప్ ముఠా ఉచ్చులో చిక్కుకున్నట్లు గుర్తించిన మాజీ జవాను ధైర్యం చేసి గిద్దలూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సురేష్ కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.