Giddalur: గిద్దలూరు అభివృద్ధిపై కలెక్టర్, ఎమ్మెల్యే సుదీర్ఘ సమీక్ష
Giddalur: గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సునీత, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Giddalur: గిద్దలూరు అభివృద్ధిపై కలెక్టర్, ఎమ్మెల్యే సుదీర్ఘ సమీక్ష
Giddalur: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ హాల్ నందు నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ విజయ సునీత తో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు,
ఈ సమావేశం ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది చర్చకు వచ్చిన జలధార - జల హారతి ద్వారా నియోజకవర్గ లోని 176 చెరువుల నీటి నిల్వలు, కాలువల పూడిక , మరమత్తులు వంటివి పూర్తి చేయాలని సాగునీరు మరియు తాగునీరు వెలిగొండ ప్రాజెక్టు పనులు కాల్వల నిర్మాణం మరియు వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కలగకుండా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రజలకు వివరించాలి చూడాలని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల మరమ్మతులు, పెండింగ్‌లో ఉన్న బి.టి. రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మరియు హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండాలని కలెక్టర్‌కు విన్నవించారు.
క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, నిధుల మంజూరు మరియు పనుల వేగవంతం గా పూర్తి చేసుకోవడానికి ఈ సమావేశంలో పొందుపరిచారు, కార్యక్రమంలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే తో పాటు J.C పులి శ్రీనివాసులు , RDO పెంచెల ప్రభాకర్ , APCPDC (S.C) K. వెంకటేశ్వర్లు , నియోజకవర్గ స్థాయి MRO , MPDO , RWS , విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.




