Sakinetipalli: గోదావరిలో వరద ఉధృతి పంటు ప్రయాణాలు నిలిపివేత!

Sakinetipalli: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక రేవు - నర్సాపురం మధ్య గోదావరి వరద ఉధృతి పెరగడంతో పంటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

PRABHU, RAZOLE
Published on: 28 Sept 2026 8:26 AM IST
Sakinetipalli
X

Sakinetipalli: గోదావరిలో వరద ఉధృతి పంటు ప్రయాణాలు నిలిపివేత!

Sakinetipalli: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి లంక రేవు–నర్సాపురం రేవు మధ్య గోదావరి నదిపై పంటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరిలో వరద ఉధృతి, ప్రవాహం పెరగడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వరద ప్రవాహం తగ్గి పరిస్థితులు అనుకూలించే వరకు పంటు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సఖినేటిపల్లి లంక రేవు, నర్సాపురం రేవుల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు, పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం పంటు ప్రయాణాలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE