Google AI Data Center: విశాఖ ఐటీ చరిత్రలో కొత్త శకం.. గూగుల్ ఏఐ డేటా హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన!

Google AI Data Center: విశాఖపట్నంలో గూగుల్ భారీ ఏఐ డేటా హబ్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ల ద్వారా 1.88 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

Arun Chilukuri
Published on: 28 April 2026 10:57 AM IST
Google AI Data Center
X

Google AI Data Center: విశాఖ ఐటీ చరిత్రలో కొత్త శకం.. గూగుల్ ఏఐ డేటా హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన!

Google AI Data Center: ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా గూగుల్ సంస్థ భారీ పెట్టుబడితో ముందడుగు వేసింది. తర్లువాడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ (AI) డేటా హబ్‌కు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ తన డేటా సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్ సామర్థ్యంతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ సెంటర్లు రానున్నాయి. 2028 నాటికి వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో గూగుల్ ఉంది. ఈ డేటా హబ్ ఏర్పాటుతో విశాఖపట్నం కేవలం ఏఐ హబ్‌గానే కాకుండా, సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌కు కూడా ప్రధాన కేంద్రంగా (Hub) అవతరించబోతోంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియా ఖండానికే విశాఖ గేట్‌వేగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 1.88 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేవలం నిర్మాణ దశలోనే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు చెందిన 60 వేల మందికి ఉపాధి దక్కనుంది.

భూ కేటాయింపుల వివరాలు:

తర్లువాడ: 266.6 ఎకరాలు (తొలి దశ)

అడవివరం: 160 ఎకరాలు

రాంబిల్లి (అనకాపల్లి): 174.80 ఎకరాలు

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story