Vizianagaram: బడి పిలుస్తుంది తెట్టంగిలో ప్రభుత్వ పాఠశాలల అవగాహన ర్యాలీ!

Vizianagaram: గుర్ల మండలం తెట్టంగి గ్రామంలో “బడి పిలుస్తుంది” ఎన్రోల్మెంట్ డ్రైవ్. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 18 April 2026 11:14 AM IST
Vizianagaram
X

Vizianagaram: బడి పిలుస్తుంది తెట్టంగిలో ప్రభుత్వ పాఠశాలల అవగాహన ర్యాలీ!

Vizianagaram: ప్రభుత్వ ఆదేశాల మేరకు “బడి పిలుస్తుంది” ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు గుర్ల మండలం తెట్టంగి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తెట్టంగి మరియు పోలాయవలస గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇరు పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది, ఎంపీపీ స్కూల్ చైర్మన్ జమ్ము ప్రసాదరావు, జెడ్పీహెచ్ఎస్ చైర్మన్ మక్కువ చిన్నప్పన్న, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“బడి పిలుస్తుంది” బ్యానర్‌తో, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల ప్లకార్డులతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..

“ప్రభుత్వం తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ టీవీ, IFP బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తోంది. అంగన్వాడీలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ అడ్మిట్ కార్డులు ఇచ్చి మన బడిలోనే చేర్చుకుంటున్నాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ చైర్మన్లు జమ్ము ప్రసాదరావు, మక్కువ చిన్నప్పన్న మహిళాపోలిస్ సునీత మరియు గ్రామ పెద్దలు మాట్లాడుతూ 100% ఎన్రోల్మెంట్ సాధించడానికి గ్రామస్థులు అందరూ సహకరించాలని కోరారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story