Razole: రాజోలులో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Razole: రాజోలు నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెదేపా ఇంచార్జి గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Updated on: 20 April 2026 12:23 PM IST
Razole
X

Razole: రాజోలులో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Razole: చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా తెదేపా రాజోలు ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆద్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి ప్రధాన కూడళ్లలో భారీ కేక్ లు కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. రాజోలు లో పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి సూర్యనారాయణ రాజు తో కలిసి అమూల్య కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు రోగులకు పాలు,పండ్లు పంచిపెట్టారు. శివకోటి హైస్కూల్ సెంటర్ లో తెలుగు యువత ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ.. చంద్రబాబు దశ,దిశా, దిక్సూచి గల గొప్ప నిర్దేశకుడు,అసాధ్యమనుకున్న దేదైన సుసాధ్యం చేసి చూపిస్తున్న గొప్ప మేథా సంపత్తి కలిగిన నాయకుడు అని కొనియాడారు.ఆయన సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని ఆకాంక్షించారు.అలాగే శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల గ్రంధాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిటికెన రామ్మోహన్ రావు, ఏపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు,మాజీ ఇంచార్జి బత్తుల రాము మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story