Vemireddy Prabhakar Reddy: సంగంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Vemireddy Prabhakar Reddy: సంగంలో ఘనంగా జరిగిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
Vemireddy Prabhakar Reddy: సంగంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Vemireddy Prabhakar Reddy: సంగంలో టీడీపీ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వి.పి.ఆర్ వాటర్ ప్లాంట్ వద్ద టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతూ ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, సంగం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ ,తెలుగు యువత అధ్యక్షులు కర్నాటి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజా సేవలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




