Srikakulam: సోంపేటలో ఆధ్యాత్మిక శోభ.. అమ్మవార్ల తిరువీధి
Srikakulam: సోంపేట మండలం తురక.శాసనం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కాల్లెమ్మ, నీలమణి దుర్గ అమ్మవార్ల ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభం.
Srikakulam: సోంపేటలో ఆధ్యాత్మిక శోభ.. అమ్మవార్ల తిరువీధి
Srikakulam: సోంపేట మండలం తురక.శాసనం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కాల్లెమ్మ, నీలమణి దుర్గ (పాతపట్నం తల్లి) అమ్మవార్ల ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
బ్రహ్మశ్రీ భూరాడ ఈశ్వర సాయి శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం పుణ్యాహ వాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, పంచగవ్యారాధన, మాత్స్యకారాధనలు, అఖండ దీప స్థాపన, ఆచార్య రిత్విక్ వరుణులు, రక్షాధారణ, యాగశాల సంస్కారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం 3 గంటల నుంచి శ్రీ ముక్కేర పోలమ్మ తల్లి త్రివీధి మహోత్సవం కనుల పండుగగా సాగింది. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మహిళలు పూర్ణ కలశాలను ఏర్పాటు చేసి, పసుపు నీళ్లతో అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. వందలాది మంది భక్తులు తిరువీధి కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
రాత్రి ఆలయ ప్రాంగణంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ, కుండ సంస్కారం, అగ్ని మథనం, జలాధివాసం, వాస్తు యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండప ఆవాహనలు, అర్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణతో మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి.
ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.




