Yerragondapalem: చిన్న దోర్నాల 'ఇంటింటికీ టీడీపీ'లో ఎరిక్షన్ బాబు!
Yerragondapalem: చిన్న దోర్నాల 'ఇంటింటికీ టీడీపీ'లో గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు.
Yerragondapalem: చిన్న దోర్నాల 'ఇంటింటికీ టీడీపీ'లో ఎరిక్షన్ బాబు!
జిల్లా :మార్కాపురం
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం: చిన్న దోర్నాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజలకు వివరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం నిర్వహించిన గ్రామ సమావేశంలో గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం తదితర కార్యక్రమాల గురించి వివరించారు.
తదుపరి చిన్న దోర్నాల గ్రామ రైతులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల ఎంఆర్ఓ అశోక్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సాహెబ్, అధికారులు, మండల కూటమి నాయకులు, బోడె నాయక్ తండా పంచాయతీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




