Rampachodavaram: రంపచోడవరం వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా గుల్లా ఏడుకొండలు
Rampachodavaram: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా గుల్లా ఏడుకొండలు నియమితులయ్యారు.
Rampachodavaram: రంపచోడవరం వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా గుల్లా ఏడుకొండలు
Rampachodavaram: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలికులుగా గుల్లా ఏడుకొండలును నియమిస్తూ అధికార పూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోట నరసింహం తెలిపారు.
ఈ సందర్భంగా గుల్లా ఏడుకొండలు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా ఈ పదవి అందించినందుకు శక్తి వంచన లేకుండా అహర్నిశలు పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తానని తెలుపుతూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోట నరసింహం కి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకి కృతజ్ఞతలు తెలిపారు.




