Palnadu: బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికేనన్న చీఫ్ విప్!

Palnadu: పల్లెలైనా, పట్టణాలైనా ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని, వినుకొండ నియోజకవర్గంలో 98 పంచాయతీల్లో కూటమి విజయం సాధించిందని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 27 Nov 2026 5:25 PM IST
Palnadu
X

Palnadu:బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికేనన్న చీఫ్ విప్! 

Palnadu: పల్లెలైనా.పట్టణాలైనా ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 94 శాతం స్థానాల్లో, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 78 శాతం స్థానాల్లో కూటమి విజయం సాధించిందని వెల్లడించారు. బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికేనని ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. ఇది నిజమైన ప్రజా విజయమని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని పేర్కొన్నారు.

వైసీపీ గత పాలనలో అనుసరించిన విధానాలను ప్రజలు అంగీకరించలేదని, అందుకే పల్లెలు, పట్టణాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమిష్టి కృషితో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలు కూటమి విజయానికి దోహదపడ్డాయని తెలిపారు.వినుకొండ నియోజకవర్గంలోని 119 పంచాయతీలకు గాను సుమారు 98 స్థానాల్లో కూటమి విజయం సాధించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామంలో సైతం టీడీపీ మద్దతుదారుడు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు కొన్ని చోట్ల పోటీకి దూరంగా ఉన్నారని ఆరోపించారు. గ్రామాల్లో చిచ్చు పెట్టడం మానుకుని బొల్లా బ్రహ్మనాయుడు తన వైఖరిని మార్చుకోవాలని జీవీ ఆంజనేయులు హితవు పలికారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA