Bheemili: ఇంటి నుంచే వివరాల నమోదు.. భీమిలి జోన్‌లో వినూత్న ప్రయోగం!

Bheemili: జీవీఎంసీ భీమునిపట్నం జోన్ పరిధిలో 2027 జనగణన ప్రక్రియ ప్రారంభం.ఆన్‌లైన్‌లో స్వీయ నమోదు విధానం, ముఖ్యాంశాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

SHIVA, BHIMILI
Published on: 15 April 2026 2:21 PM IST
Bheemili
X

Bheemili: ఇంటి నుంచే వివరాల నమోదు.. భీమిలి జోన్‌లో వినూత్న ప్రయోగం!

Bheemili: మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ భీమునిపట్నం జోన్ పరిధిలో జనగణన 2027కు వినూత్న విధానాలు అమలు చేస్తు న్నారు. ముందు ఇళ్లగణన నిర్వహించి.. ఆ తర్వాత జనగణనకు శ్రీకారం చుడతారు. గతంలో ఎన్యుమరేటర్లు గడపగడపనకు వచ్చినప్పుడు ఇళ్లల్లో ఎవరూ లేకపోతే జనాభా లెక్కల్లో సరిగా నమోదులు జరిగేవి కావు. ఈ దఫా అంతర్జాలంలో వచ్చే లింకులో స్వీయ నమోదుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు భీమునిపట్నం జోనల్ కమిషనర్ శ్రీ ఎమ్ విజయకుమార్ గారు పేర్కొన్నారు. దీంతో పార దర్శకంగా, పక్కాగా నమోదు జరగనుంది.

రెండు దఫాలుగా..: తొలుత వచ్చే మే 1 నుంచి 31వ తేదీ వరకు ఇళ్ల గణన చేపట్టనున్నారు. ఇందులో 34 ప్రశ్నలతో వివరాలను ఇంటింటా రాబడతారు. ఇదే ఇళ్లగణనకు సంబంధించి స్వీయ నమోదుకు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు అంతర్జాలంలో లింకు అందు బాటులో ఉంచుతున్నారు.

రెండో విడతగా 2027 ఫిబ్రవరిలో ఇళ్లతో సంబంధం లేకుండా జనగణన జరగనుంది. ఈ సందర్భంలో ఇళ్లు లేకుండా రోడ్డు మార్జిన్లు, బస్టాండ్లలో తలదాచుకునే వారి వివరాలను కూడా సేకరించి 2027 మార్చి 1న భారతదేశ జనాభా గణాంకాలు విడుదల కానున్నాయి.

ఇళ్ల గణన స్వీయ నమోదును జాతీయ జనగణన పోర్టల్ '

https://se.census.gov.in

వెబ్సైట్, ఫోన్ యాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. పోర్టల్, యాప్లో ఇంటి యజమాని ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేశాక ప్రశ్నావళితో కూడిన పోర్టల్ వస్తుంది. వాటికి సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. అనంతరం హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ వస్తుంది. ఇళ్ల గణనకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఈ ఐడీని చూపించాలి. వారు మరోసారి సరిచూసి మార్పు లుంటే చేస్తారు.

ప్రశ్నలు ఇలా..

ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తొలుత స్వీయ నమోదులో పాల్గొన్నారా లేదా అనేది నివృత్తి చేసుకుంటారు. స్వీయ నమోదులో పాల్గొంటే వారి వివరాలు సేకరిస్తారు.

సీరియల్ సెన్సస్ హౌస్, హౌస్ హోల్డ్ సీరి యల్, భవనం నంబర్లు, ఇంటి నేలకు వాడిన ప్రధాన వస్తువులు, గోడకు వినియోగించిన వస్తువు, పైకప్పు వివరాలు నమోదు చేస్తారు. గృహం వాడుక నివా సమా? లేక ఇతరమా, పూరిల్లా లేక భవనమా తది తరాలు సేకరిస్తారు.

కుటుంబంలో నివసిస్తున్న మొత్తం సభ్యుల సంఖ్య, యజమాని పేరు, జెండర్, కులం, ఇల్లు అద్దె లేక సొంతమా? గదుల సంఖ్య, ఎంతమంది నివసిస్తు న్నారు. తాగునీటి వనరు, మరుగుదొడ్డి వసతి, ఎల్పీజీ, పీఎనీ కనెక్షన్లు, ల్యాప్టాప్, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, వాహనాలు ఉన్నాయా? ఇలా 34 రకాలు ప్రశ్నలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story