Visakhapatnam: విశాఖలో టీడీపీ సునామీ.. భారీ ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి శ్రావణి
Visakhapatnam: విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 38,935 ఓట్ల ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, వైసీపీ కుదేల్.
Visakhapatnam: విశాఖలో టీడీపీ సునామీ.. భారీ ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి శ్రావణి
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల ఫలితాల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. వైసీపీ కోటను బద్దలు కొడుతూ తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
తీవ్ర ఉత్కంఠ రేపిన జీవీఎంసీ మేయర్ పీఠం రేసులో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణి కంటే ఏకంగా 38,935 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతూ విజయం వైపు వేగంగా పయనిస్తున్నారు. ఇప్పటి వరకు కౌంటింగ్ అధికారులు వెల్లడించిన లెక్కింపు గణాంకాల ప్రకారం.. మొత్తం 1,37,740 ఓట్లను లెక్కించగా, అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కా శ్రావణి ఏకంగా 80,964 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణికి 42,029 ఓట్లు మాత్రమే పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థికి 1,373 ఓట్లు, ఇతరులకు 13,374 ఓట్లు లభించాయి.
ఇక డివిజన్ల వారీగా చూస్తే విశాఖలోని మొత్తం 120 డివిజన్లలో కూటమి తన మార్క్ చూపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన అధికారిక ఫలితాల్లో టీడీపీ 18 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించగా, వైసీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. మరో 28 డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ముందంజలో ఉండటంతో విశాఖ కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరడం ఖాయమైంది.




