Vissannapeta: విస్సన్నపేటలో గాలివాన బీభత్సం.. నేలకొరిగిన చెట్లు, స్తంభాలు

Vissannapeta: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో గాలివాన బీభత్సం. రహదారులపై విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Jun 2026 1:14 PM IST
Vissannapeta
X

Vissannapeta: విస్సన్నపేటలో గాలివాన బీభత్సం.. నేలకొరిగిన చెట్లు, స్తంభాలు

ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేట మండలంలో గాలివాన బీభత్సం.. విస్సన్నపేట నుండి పుట్రెల వరకు రోడ్లపై విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. విస్సన్నపేట-పుట్రెల ప్రధాన రహదారిలో నిలిచిపోయిన రాకపోకలు. ఇరువైపుల కిలోమీటర్ల మేర నిలిచిపోయిన లారీలు, బస్సులు.

చoడ్రుపట్ల గ్రామం నుండి తెల్లదేవరపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా విరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. చెట్లు, స్తంభాల తొలగింపు చర్యలు చేపట్టిన రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులు. రంపం కోత యంత్రాలతో చెట్లను తొలగిస్తున్న సిబ్బంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story