AP Local Body Elections 2026: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు!
AP Local Body Elections 2026: పులివెందుల నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్తత. వైకాపా కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.
AP Local Body Elections 2026: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు!
AP Local Body Elections 2026: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) శ్రేణుల మధ్య రగడ చెలరేగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
నామినేషన్లు వేసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ కేంద్రంలో టీడీపీ నేతలు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
టీడీపీ నేతలు బయటకు వచ్చిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కానీ నిబంధనలు వినకుండా వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది.
తోపులాట తీవ్రమవ్వడం, పరిస్థితి చేజారే ప్రమాదం ఉండటంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గుంపును అదుపు చేశారు.
ఘటన అనంతరం నామినేషన్ ప్రాంగణంలో అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.




