Nellore: ప్రతి రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసులా విచారించాలి
Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది.
Nellore: ప్రతి రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసులా విచారించాలి
Nellore: నెల్లూరు జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా యస్పి DR అజిత వేజెండ్ల మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, PM రాహాత్ స్కీం, రోడ్డు భద్రతా చర్యల అమలు పై సమగ్రంగా సమీక్షించారు.
ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గత క్వార్టర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదమరణాలు పై వివరణాత్మకంగా రోడ్డు ప్రమాదాలు ఎలా జరిగాయి, వాటి ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశాలపై అన్ని కోణాల్లో
టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా ప్రతి రోడ్డు ప్రమాదాన్ని శాస్త్రీయంగా పరిశీలించి, ఖచ్చితమైన కారణాలను గుర్తిస్తూ విశ్లేషణ వివరాలు PPT ద్వారా ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతట సదరు ప్రజెంటేషన్‌ను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. రాబోయే మీటింగ్‌కు మిగిలిన శాఖలు అధికారులు కూడా మరింత సమగ్ర సమాచారం, ఫీల్డ్ స్థాయి వివరాలతో సిద్ధంగా రావాలని సూచించారు.
జిల్లా ఎస్పీ DR అజిత వేజెండ్ల ఈ సమావేశంలో మాట్లాడుతూ..
ప్రతి ఫేటల్ ఆక్సిడెంట్ కేసును ఒక హత్య కేసు దర్యాప్తు మాదిరి విచారణ చేయాలని గౌరవ డీజీపీ ఇచ్చిన సూచనలు మేరకు జిల్లా లోని ప్రతి లా & ఆర్డర్, ట్రాఫిక్ డివిజన్ పోలీస్ అధికారులు సంబందించిన శాఖల సమన్వయముతో పని చేస్తున్నారు అని తెలిపారు. రోడ్ సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వలన ప్రమాదాలకు కారణమైన వారిపై మరియు విధుల్లో అలసత్యం ప్రదర్శించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని యస్పి పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సౌజన్య , DTRB తరుపున తయారు చేసిన రోడ్ సేఫ్టీ డేటా, PM-రాహాత్, అమలు లో భాగంగా TMS సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ స్టేట్ మరియు జిల్లా ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ విభాగాలు PM రాహాత్ స్కీం లో రోడ్డు ప్రమాద ఘటన మరియు భాదితులవివరాలు ఎంట్రీ అన్ని పోలీస్ స్టేషన్స్ e-DAR ద్వారా వచ్చే అలెర్ట్ గురించి మరియు పోలీస్ అధికారులు చేపడుతున్న అవగాహనా సదస్సులు, చర్యలు గురించి ఈ సమావేశంలో వివరించారు.




