Palavalasa: పేద కుటుంబానికి అండగా PSI సేవా సంస్థ.. విరాళం అందజేత!

Palavalasa: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో అనారోగ్యంతో పెద్దదిక్కును కోల్పోయిన పేద కుటుంబానికి PSI సేవా సంస్థ అండగా నిలిచింది.

G.RAMBABU, SOMPET
Published on: 8 April 2026 5:39 PM IST
Palavalasa
X

Palavalasa: పేద కుటుంబానికి అండగా PSI సేవా సంస్థ.. విరాళం అందజేత!

Palavalasa: శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, పాలవలస గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు మరణించడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన PSI సేవా సంస్థ స్పందించి, దయగల దాతల నుండి విరాళాలు సేకరించి,08-డిసెంబర్-2025 నాడు ₹10,016/- మరియు ఈరోజు ₹40,000/- మొత్తంగా ₹50,016/- ను PSI కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.

ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం మరియు అత్యవసర అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచిస్తూ, భవిష్యత్తులో కూడా తమ PSI సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story