IMD Weather Forecast: తెలుగురాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు.. రాబోయే 3రోజుల వాతావరణం
IMD Weather Forecast: తెలుగు రాష్ట్రాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD Weather Forecast: తెలుగురాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు.. రాబోయే 3రోజుల వాతావరణం
IMD Weather Forecast: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. దక్షిణ శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 రోజుల వాతావరణం:
కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం: కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ, గరిష్టంగా 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాయలసీమ: రాయలసీమలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. బుధ, గురువారాల్లో వాతావరణం ఇలాగే కొనసాగినప్పటికీ, వర్షాల సమయంలో ఈదురుగాలుల తీవ్రత గంటకు 40–50 కి.మీ, గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి:
తెలంగాణలోకి ఈశాన్య రుతుపవనాలు విస్తరించేందుకు తగిన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉండగా, గురువారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.




