Markapuram: కబ్జాలపై ఇమ్మడి కాశీనాథ్ ఆగ్రహం.. అక్రమ హద్దులు తొలగింపు
Markapuram: మార్కాపురం అల్లూరి పోలేరమ్మ దేవస్థానం వెనుక 12 ఎకరాల విలువైన భూమి కబ్జాకు గురైందని, దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ డిమాండ్ చేశారు.
Markapuram: కబ్జాలపై ఇమ్మడి కాశీనాథ్ ఆగ్రహం.. అక్రమ హద్దులు తొలగింపు
Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణం అల్లూరి పోలేరమ్మ దేవస్థానం వెనుక సుమారు 240 మంది కుటుంబాలకు చెందిన 12 ఎకరాల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించారని బాధితులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ని ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ గారు కబ్జా జరిగిన స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువ ఉన్న భూమిని కబ్జా చేయడాని ఖండిస్తూ, మార్కాపురం జిల్లా కోసం పోరాటాలు చేసి జిల్లాను దక్కించుకుంటే, జిల్లా ఏర్పడిన తర్వాత నుండి మార్కాపురంలో భూ కబ్జాల ఫిర్యాదులు వస్తున్నాయని,
కష్టపడి సంపాదించుకున్న ప్రజల భూములను కొందరు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులు ఇప్పటికైనా స్పందించి మారనిచో ప్రజల తిరుగుబాటును చవి చూడవలసి వస్తుందని, సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇమ్మడి కాశీనాథ్ కబ్జా సమయంలో తొలగించిన హద్దులను తిరిగి స్థాపించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ దేవస్థాన కమిటీ సభ్యులు విజయరావు నరసింహరావు, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసరావు, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, ఉమ్మడి రవీంద్ర, కంబం వెంకట రమణ, బట్టగిరి మురళీధర్ రెడ్డి, సున్నం కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మయూరి ఖాసీమ్, సత్యం రెడ్డి, తడికమల్ల బాల సుబ్బారావు, సోమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.




