Vizag: కార్మికులకు వరం E-Shram.. కార్డులు పంపిణీ చేసిన మంత్రి సుభాష్!

Vizag: విశాఖపట్నంలో జరిగిన ఈ-శ్రమ్ నమోదు కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.

GOPI, PENDURTHI
Published on: 8 April 2026 9:57 PM IST
Vizag
X

Vizag: కార్మికులకు వరం E-Shram.. కార్డులు పంపిణీ చేసిన మంత్రి సుభాష్!

Vizag: అసంఘటిత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం స్థానిక టన్నెల్ చౌల్ట్రీ లొ జరిగిన కార్మికుల నమోదు కార్యక్రమం లోపాల్గొన్నారు.అసంఘటిత కార్మికుల నమోదు E- Shram కార్డులు పరిశీలించి పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ E-Shram కార్మికులకు మద్దతుగా E-shram ఆన్లైన్ పోర్టల్ రూపొందించబడ్డాయని, అధికారులు E-Shram కార్డులు పై అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల మంది అసంఘటిత కార్మికులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 88 లక్షలు నమోదు చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.

E-Shram కార్డు వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్క కార్మికుడు రిజిస్టర్ అయి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందాలని కోరారు. ఈ పథకంలో ప్రమాద బీమా కింద పూర్తి వైకల్యం పొందినట్లయితే 2 లక్షల బీమా, పాక్షిక వైకల్యం పొందినట్లయితే ఒక లక్ష ప్రమాద బీమా కవరేజ్ వర్తిస్తుందని మంత్రి తెలిపారు, 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలవారి 3000 పెన్షన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఆరోగ్య బీమా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ స్కీమ్‌లతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష ప్రవేశం ఉంటుందని మంత్రి తెలిపారు.

భారతదేశం అంతటా చెల్లుబాటులో ఉండే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), వలస కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సంక్షోభ సమయాల్లో అత్యవసర ఆర్థిక సహాయం అందుతుందన్నారు. అసంఘటిత కార్మికులకు ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ, ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు కల్పించడం మే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.

అనంతరం మంత్రి పూర్ణ మార్కెట్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్,దుకానాలలో లో పని చేస్తున్న పలువురు కార్మికులతో మాట్లాడి E-Shram కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ లు, E-Shram కార్డులపై కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను కార్మికులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక మండలి ఛైర్మన్ వలవాల మల్లికార్జున రావు(బాబ్జీ), కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు, విశాఖపట్నం జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story