AP Panchayat Raj: పారదర్శక పాలనతో పల్లెల్లో వెలుగులు: ఏపీ పంచాయతీరాజ్ అద్భుత ప్రగతి
AP Panchayat Raj: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ సాధించిన విజయాలను జనసేన నాయకులు రాజు గౌడ్ వివరించారు.
AP Panchayat Raj: పారదర్శక పాలనతో పల్లెల్లో వెలుగులు: ఏపీ పంచాయతీరాజ్ అద్భుత ప్రగతి
AP Panchayat Raj: జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దశ -దిశ మారుస్తున్న పవన్ కళ్యాణ్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు.. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ నగర జనసేన నాయకులు రాజు గౌడ్ యాత మాట్లాడుతూ..
జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం.
* స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు
* ఫలితాన్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలు
* గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం
* రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లోనూ నంబర్ వన్ స్థానం
* సంస్కరణలతో వ్యవస్థల బలోపేతం
* పారదర్శక విధానాలతో పల్లెల్లో అభివృద్ధి వెలుగులు
* పల్లె ప్రగతే పంచాయతీరాజ్ దినోత్సవానికి అసలైన నిదర్శనం అంటున్న ప్రజలు*
• గ్రామ సభలు చారిత్రాత్మక ఘట్టం
* ఉద్యోగులకు పదోన్నతుల ఉత్సాహం
• మౌలిక వసతులు, గ్రామీణ అనుసంధానం
* వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ సంకల్పం
* గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
* డిజిటల్ పాలనతో పారదర్శకత
• జాతీయ స్థాయి అవార్డుల్లో సంచలనం
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరే వరకు పని చేస్తుంది. గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లతో స్వయం సమృద్ధ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతోంది అని రాజు గౌడ్ యాతా తెలియజేశారు.




