Razole: రాజోలు పీఎస్‌లో జనసేన ఫిర్యాదు
Razole: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ బాబుకు వినతి.
Razole: రాజోలు పీఎస్‌లో జనసేన ఫిర్యాదు
రాజోలు: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌బాబుకు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రచారం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజా సేవకు, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




