Sangam: పవన్ త్వరగా కోలుకోవాలని గంగమ్మ తల్లికి జనసైనికుల పూజలు

Sangam: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు జిల్లా సంగం మండలంలోని శ్రీ గంగమ్మ తల్లికి జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 April 2026 9:56 PM IST
Sangam
X

Sangam: పవన్ త్వరగా కోలుకోవాలని గంగమ్మ తల్లికి జనసైనికుల పూజలు

Sangam: ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలతో జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ సూచన మేరకు నెల్లూరు జిల్లా సంగం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు దాడి భాను కిరణ్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సంగం మండల పరిధిలో ఉన్న గంగమ్మ అమ్మవారి దేవస్థానంలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దాడి భాను కిరణ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగుంటేనే మనందరం బాగుంటామని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న తరుణంలో అస్వస్థతకు గురవ్వటం బాదాకరం-ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగక శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అస్వస్థత నుంచి కోలుకుని, తిరిగి ప్రజా క్షేత్రంలో మరింత శక్తివంతంగా సంగం మండలంలోని శ్రీ గంగమ్మ అమ్మవారిని కోరుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన పార్టీ నాయకులు షేక్ అహ్మద్ భాషా,టౌన్ నాయకులు రాసిన గురవరాజు, గుంజి జయరాజు, చల్లా చిరంజీవి, సిద్దిపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, గాంధీ జన సంఘం జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోట్లూరి వినయ్, ప్రదీప్, హరి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story