JPC Meeting: ముంబై జేపీసీ సమావేశంలో ఎంపీ బీద మస్తాన్ రావు!

JPC Meeting: ముంబైలో జరిగిన కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు–2026 సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 4 July 2026 9:52 AM IST
JPC Meeting
X

JPC Meeting: ముంబై జేపీసీ సమావేశంలో ఎంపీ బీద మస్తాన్ రావు!

JPC Meeting: ముంబైలో జరుగుతున్న కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు–2026పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) అధ్యయన పర్యటనలో భాగంగా జరిగిన సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు, జేపీసీ సభ్యులు డా బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (Alternative Investment Funds), నమోదిత పెట్టుబడి సలహాదారులు, అంతర్జాతీయ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలు డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, విలువ నిర్ధారణ సంస్థలు, ప్రముఖ న్యాయ సలహా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ, జీఐసీ రీ, సిడ్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా* ప్రతినిధులతో జరిగిన విస్తృత చర్చల్లో పాల్గొన్నారు.

కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు–2026లో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, వ్యాపార నిర్వహణలో సులభతరం, స్టార్టప్‌లు మరియు ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం, పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ, నియంత్రణ వ్యవస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై జరిగిన చర్చల్లో డా బీద మస్తాన్ రావు యాదవ్ తన అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. వివిధ రంగాల ప్రతినిధులు చేసిన సూచనలను ఆసక్తిగా విని, వాటిపై సభ్యులతో కలిసి సమగ్రంగా చర్చించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story