KA Paul: దాచుకున్న నల్లధనం కాపాడుకోవడానికే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2026 5:56 PM IST
KA Paul
X

KA Paul: దాచుకున్న నల్లధనం కాపాడుకోవడానికే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా ప్రకటించిన రాజకీయ పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి స్థాపించింది 'పరివర్తన పార్టీ' కాదని, అది కేవలం 'అపరివర్తన అవినీతి పార్టీ' అని ఎద్దేవా చేశారు. తాను అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని కాపాడుకోవడానికే ఆయన మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు.

గతంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మళ్లీ కొత్త వేషంలో రావడం వెనుక పెద్ద వ్యూహం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఆయనకు భారీగా ఉన్న ఆస్తులను, దోచుకున్న సొమ్మును తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) ఎందుకు విచారణ జరపడం లేదని సూటిగా ప్రశ్నించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు, ఇతర రాజకీయ శక్తుల ప్రయోజనాల కోసమే విజయసాయిరెడ్డి ఈ కొత్త పార్టీని తెరపైకి తీసుకొచ్చారని కేఏ పాల్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఒకే వర్గం ఆధిపత్యం చెలాయిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం ఎప్పుడు దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.