Kadapa RIMS: కడప రిమ్స్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 30 మంది డెంటల్ విద్యార్థులకు వాంతులు, విరేచనాలు!
Kadapa RIMS: కడప రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్‌లో ఘోరం చోటుచేసుకుంది. మెస్ ఆహారం వికటించి దాదాపు 30 మంది వైద్య విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Kadapa RIMS: కడప రిమ్స్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. 30 మంది డెంటల్ విద్యార్థులకు వాంతులు, విరేచనాలు!
Kadapa RIMS: కడప రిమ్స్ డెంటల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా వైద్య విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కళాశాల హాస్టల్లో రాత్రి తీసుకున్న ఆహారం కలుషితం కావడంతో.. దాదాపు 30 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే సిబ్బంది పక్కనే ఉన్న రిమ్స్ జనరల్ హాస్పిటల్కూ తరలించారు. దీంతో డాక్టర్లు అస్వస్థతకు గురైన వైద్య విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థినులకు ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదం లేదని రిమ్స్ వైద్యులు తెలిపారు.
అయితే ఈ ఘటనను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు రాకుండా బాధిత విద్యార్థులకు రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఫుడ్ పాయిజన్‌కు మెస్‌లో వడ్డించిన ఆహారమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హాస్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




