Tirupati: సత్యన్న త్వరలోనే బయటకు వస్తారు.. పూజిత రెడ్డి భరోసా
Tirupati: తిరుపతి జిల్లా చిల్లకూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి భార్య ప్రభావతమ్మను కాకాని పూజిత రెడ్డి పరామర్శించారు.
Tirupati: సత్యన్న త్వరలోనే బయటకు వస్తారు.. పూజిత రెడ్డి భరోసా
Tirupati: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు నివాసి, మాజీ NDCCB చైర్మన్,వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సతీమణి కామిరెడ్డి ప్రభావతమును మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత రెడ్డి శనివారం పరామర్శించారు. అక్రమ కేసులో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గత నెలరోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి కాకని పూజిత ప్రభావతమ్మకు మనోధైర్యన్నిచ్చారు.సత్యన్న తొందరలో బయటకు రాబోతున్నారని.. కుటుంబసభ్యులు,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుండె ధైర్యంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు పై కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతుందని.. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె అన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు అధికార పార్టీ చేసుకున్న దౌర్జన్యాలకు అడ్డుకట్టగా నిలుస్తున్నారని.. లేకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు భాగాలుగా చీల్చి సగం తెలంగాణకు సగం తమిళనాడుకు ఉమ్మడి ప్రభుత్వం అమ్మేసి ఉండేదని ఆమె ఎద్దేవా చేశారు. పెద్ద వ్యక్తి మాజీ ఎన్ డి సి సి బి చైర్మన్ అంత పెద్ద వ్యక్తిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేయడం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, నాయుడుపేట పెళ్లకూరు ఓజిలి మాజీ ఎంపీపీలు కురుగొండ ధనలక్ష్మి, పోలం రెడ్డి శేఖర్ రెడ్డి, గడ్డం అరుణ, పెన్నేపల్లి మాజీ ఎంపీటీసీ వల్లూరు సుధారాణి,పాదర్తి హరినాద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాలేటి నాగార్జున ,శేఖర్ నెలవల రవి వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




