Kakinada: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: బాబాయి ఆరోపణలు ఫేక్.. తేల్చేసిన పోలీసులు!
Kakinada: కాకినాడ జిల్లా తుని మండలం సి.హెచ్.అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ట్విస్ట్.
Kakinada: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు: బాబాయి ఆరోపణలు ఫేక్.. తేల్చేసిన పోలీసులు!
Kakinada: కాకినాడ జిల్లా తుని మండలం సి.హెచ్.అగ్రహారంలో గతనెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కారు దాడి ఆరోపణ అవాస్తమని పోలీసులు స్పష్టంచేశారు. చిన్నారి బాబాయి కోటేశ్వరరావు ఆరోపణలు అవాస్తవమని పోలీసులు నిర్ధారించారు. కోటేశ్వరరావును నర్సీపట్టణంలో ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టింది తప్పా.. దాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
అలాగే చిన్నారి అదృశ్యం రోజు అగ్రహారంలో కనిపించిన కారు.. అతనిని గుద్దికారు ఒకటి అనుకుని కోటేశ్వరరావు ఆవేదనలో ఆరోపణ చేశాడని పోలీసులు వివరించారు. అది ఎటాక్ కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని.. కంగారులో తాను అలా మాట్లాడానని చిన్నారి బాబాయి కోటేశ్వరరావు అంగీకరించాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్డవద్దని పోలీసులు సూచనలు చేశారు.




