Kalyandurg: దేశాభివృద్ధికి పునాది జనాభా లెక్కలే.. కళ్యాణదుర్గం ఆర్డీఓ
Kalyandurg: అనంతపురం జిల్లా శెట్టూరులో జనగణన-2027 శిక్షణ తరగతులను పరిశీలించిన ఆర్డీఓ వసంత బాబు.
Kalyandurg: దేశాభివృద్ధికి పునాది జనాభా లెక్కలే.. కళ్యాణదుర్గం ఆర్డీఓ
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనగణన–2027 (దశ–I) శిక్షణ తరగతులను కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంత బాబు సందర్శించారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న అధికారులకు, సిబ్బందికి జనగణన ప్రాముఖ్యతపై ఆయన సమగ్రంగా వివరించారు. దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన కీలకమని, ఖచ్చితమైన సమాచార సేకరణ అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి గృహానికి వెళ్లి సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అదేవిధంగా జనగణన ప్రక్రియలో పాటించాల్సిన నియమాలు, గృహ గణన విధానం, డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఫీల్డ్‌లో పని చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందికి సెన్సస్ కార్యకలాపాలకు సంబంధించిన నియామక పత్రాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత ట్రైనర్లు, అధికారులు మరియు సిబ్బంది. పాల్గొన్నారు.




