Cheepurupalli: మెట్టపల్లిలో సూర్యాంధ్ర ప్రగతి పథం జెండా ఆవిష్కరణ

Cheepurupalli: చీపురుపల్లి మెట్టపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సూర్యఘర్ యోజన ఉత్సవ్‌ను ప్రారంభించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 14 April 2026 4:28 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: మెట్టపల్లిలో సూర్యాంధ్ర ప్రగతి పథం జెండా ఆవిష్కరణ

Cheepurupalli: చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో "ప్రధాన మంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్" పథకాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు మరియు చీపురుపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన "సూర్యాంధ్ర ప్రగతి పథం" జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళావెంకట రావు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 75,000 కోట్ల భారీ పెట్టుబడితో కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

"ప్రధాన మంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్" ద్వారా గిరిజన కుటుంబాలకు ఈ సోలార్ ప్యానెల్స్ ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ మరియు ఎస్టీ గృహ వినియోnగదారుల ఇంటి పై కప్పు పై 2 kwp సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారన్నారు.

దీని ద్వారా లబ్ధిదారులు తమ ఇంటిపైనే కరెంట్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన ప్రతి ఇంటికి విద్యుత్ శాఖ నెలకు రూ. 200/- అద్దె రూపంలో చెల్లిస్తుందని ఆయన వివరించారు.

విద్యుత్ మోటార్ల గురించి ప్రస్తావిస్తూ.. జిల్లా వ్యాప్తంగా 1600 దరఖాస్తులు రాగా, అందులో ఒక్క మన నియోజకవర్గం నుంచే 700 దరఖాస్తులు రావడం సంతోషకరమని అన్నారు. దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరికీ బోర్లు మంజూరు చేసేలా చూడాలని ఎస్.ఈ . లక్ష్మణరావు ని ఎమ్మెల్యే కోరారు.

ఇటీవల ముఖ్యమంత్రి చీపురుపల్లి వచ్చినప్పుడు నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు. తోటపల్లి కాలువ ద్వారా పంటల సాగుకు నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, అలాగే భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో రైతులు ఎక్కువ సంఖ్యలో మోటార్లు, బోర్లు అడుగుతున్నారని ముఖ్యమంత్రికి వివరించినట్లు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, నియోజకవర్గానికి అదనంగా బోర్లు, మోటార్లు కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఆర్‌ఈసీఎస్ (RECS) పునరుద్ధరణ కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చేకూరే లబ్ధి వివరాలను అధికారులు వెల్లడించారు:

మొత్తం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు: 6,323 మంది.

మొదటి విడత లబ్ధిదారులు: 1,835 మంది.

సోలార్ రూఫ్ టాప్ కెపాసిటీ: 3.67 మెగావాట్లు.

కేటాయించిన సబ్సిడీ: రూ. 22.34 కోట్లు.

పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న అధికారులను ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story