PGannavaram: పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. ఆందోళన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం కోరుతూ నాయకులు, కార్యకర్తల ఆందోళన.

RAJU, P GANNAVARAM
Updated on: 26 July 2026 1:08 PM IST
PGannavaram
X

PGannavaram: పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. ఆందోళన

గన్నవరం:అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నియోజకవర్గానికి వెంటనే ఇన్‌చార్జిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు సమక్షంలో జరిగిన సమావేశంలో

కార్యకర్తలు,నాయకులు అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్న డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు హాజరయ్యారు. అయితే, సమావేశం జరుగుతుండగానే నియోజకవర్గానికి ఇన్‌చార్జిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పి.గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జిని ప్రకటించకపోవడంపై అధిష్ఠానం తీరును వారు తీవ్రంగా తప్పుబట్టారు..

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story