Kurnool: మార్చి నాటికి పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి కావాలి.. కలెక్టర్

Kurnool: కర్నూలు జిల్లాలో మార్చి 2027 నాటికి పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశం.

V RAMAMOHAN, KURNOOL
Published on: 15 April 2026 7:46 PM IST
Kurnool
X

Kurnool: మార్చి నాటికి పాస్‌బుక్‌ల పంపిణీ పూర్తి కావాలి.. కలెక్టర్

Kurnool: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నుండి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. బుధవారం సాయంకాలం చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులతో మాట్లాడుతూ 22ఏ రికార్డు లు సరి చేయాలని , రెవెన్యూ రికార్డు ల డిజిటలైజషన్ లు త్వరగా చేయాలని , రీసర్వే పనులు అన్ని పూర్తి చేసుకుని మార్చి 2027 నాటికి అన్ని పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణి పూర్తి చేయాలని,

గత కొన్ని నెలల నుండి పెండింగ్‌లో ఉన్న అన్ని మ్యుటేషన్‌లు మరియు సబ్-డివిజన్‌లను జూన్ 2026 నాటికి పూర్తి చేయాలి అని, పట్టా దార్ పాసుబుక్ ల పంపిణీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు రీ సర్వేను సమీక్షిస్తారు. ఎలాంటి తప్పులు లేని పాస్‌బుక్‌లు జారీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కావున ఎలాంటి తప్పులు ఉండరాదని పాస్‌బుక్‌ల విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా, సంబంధిత అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి అని కలెక్టర్ తెలిపారు .

వర్షపు నీటిని నిలువ చేసుకునే అన్ని చర్యలు , చెరువుల లో ఉన్న పూడికలు , పంటకాలువల పూడికలు తీసే చర్యలు చేపట్టాలని అన్ని చెరువులు నీటితో నింపే చర్యలు తీసుకోవాలి అని వీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగే చర్యలు చేపట్టాలని అని కలెక్టర్ ఆదేశించారు. ట్యాంక్ వైస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒక ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంక్ కు నీరు చేరే లాగా అనుసంధానం చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టి

మాస్టర్ ట్రైనర్స్ ని గుర్తించాలి అన్నారు. గుర్తించిన వారిని అన్నమయ్య జిల్లాకు పంపించి అక్కడ వారికి ట్రైనింగ్ ఇప్పించి కర్నూలు జిల్లా లో ఆవిధంగా పనులు జరిగే లాగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. ఒక గ్రామపంచాయతీలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి? ఆ ట్యాంకులకు సంబంధించి జరుగవలసిన మరమ్మత్తు పనులు గుర్తించి వాటిలో ఎన్ని అప్రూవ్ చేశారో ఆ ట్యాంకులకు ఇప్పుడు ఎస్టిమేట్ జెనరేట్ చేయాలి ఆదేశించారు .

వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఇన్చార్జ్ డిఆర్ఓ చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈవో రమణారెడ్డి, డ్వామా పిడి నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ ప్రభాకర్ రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ పి ఓ సురేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి హేమంత్ కుమార్, ఎస్ డి సి నాగప్రసూన, డిపిఓ భాస్కర్, గ్రౌండ్ వాటర్ డి. డి. సునీల్ కుమార్, తహసీల్దార్ లు వెంకటేశ్వర్లు, ప్రకాష్ బాబు మొదలగు వారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story