Kurnool: టీనేజీ ప్రెగ్నెన్సీలపై ఉక్కుపాదం.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Kurnool: కర్నూలు జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజీ గర్భాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 April 2026 6:25 PM IST
Kurnool
X

Kurnool: టీనేజీ ప్రెగ్నెన్సీలపై ఉక్కుపాదం.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Kurnool: జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా బాల్యవివాహాలు,టీనేజీ ప్రెగ్నెన్సీ లు నమోదు అవుతున్నాయని, వీటిపై నిరంతరం నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ మహిళా పోలీస్ , ఏఎన్ఎం, ఆశ సిబ్బంది వారి పరిధిలో కౌమార దశలో ఉన్న బాలికలను, వారి తల్లిదండ్రులతోనూ సంప్రదిస్తూ బాల్య వివాహాలు చేయకుండా, టీనేజ్ గర్భం దాల్చకుండా వారికి సరైన సూచనలు చేయాలని,

ఇందువల్ల జరిగే ఉండాలని, దుష్పరిణామాలను వివరించాలని ఆదేశించారు. బాల్య వివాహాలు చేస్తే బాధ్యులైన వారికి లక్ష రూపాయల జరిమానా, రెండు సంవత్సరాల కారాగార శిక్ష ఉంటుందని, బాల్య వివాహాలు చేసిన వారికి బాల్య వివాహ చట్ట ప్రకారం శిక్ష కాకుండా, నిర్భయ చట్టం కూడా అమలు చేస్తారని, కేసు బుక్ చేస్తే బెయిల్ కూడా రాదని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని 361 పాఠశాలలలో బాలికలతో సఖ్యతతో ఉండే మహిళా టీచర్ (ఫ్రెండ్లీ టీచర్ ) ను నోడల్ అధికారిగా ఏర్పాటు చేసుకుని, బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకావాలని డీఈవో సుధాకర్ ను ఆదేశించారు..ప్రతి పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ను ఏర్పాటు చేయించాలన్నారు.

అలాగే పాఠశాలల్లో బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. అలాగే అబ్బాయిలకు ఫోక్సో చట్టం గురించి పోలీసు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

అమ్మాయిలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన జరిగే నష్టాలను, ఇబ్బందులను కర్నూలు జిల్లా వైద్య విద్యార్థినుల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో, జిజిహెచ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు.

బాల్య వివాహాలు జరగకుండా, టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదు కాకుండా చైతన్యం తీసుకు వచ్చేలా కళాజాత బృందాలను, బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రధము, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఐసిడిఎస్ పిడి విజయ ను ఆదేశించారు.

అమ్మాయిలకు , అబ్బాయిలకు విడివిడిగా సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి జూలై నెలలోపు కార్యాచరణ తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో కర్నూలు సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు , డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా , డిఎం హెచ్ ఓ డాక్టర్ కామేశ్వరరావు , ఐ సి డి ఎస్ పిడి విజయ మెడికల్ కాలేజ్ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సావిత్రి సుధాకర్ , జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద , మలేరియా ఆఫీసర్ డాక్టర్ నూకరాజు , ఆదోని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగరాజు , డిఆర్డిఏ పిడి రమణారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story