Nellore: బంధువుల ముసుగులో భూ కబ్జా.. బాధితుల ఆందోళన
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామంలో భూ వివాదం. బంధువుల చేతిలో మోసపోయిన బాధితులు.
Nellore: బంధువుల ముసుగులో భూ కబ్జా.. బాధితుల ఆందోళన
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు నమ్మిన బంధువులే మోసం చేయడమే కాకుండా, రౌడీ మూకలతో దౌర్జన్యానికి దిగిన ఘటన రాపూరు మండలంలోని తెగచర్ల గ్రామంలో జరిగింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 2015వ సంవత్సరంలో తెగచర్ల గ్రామానికి చెందిన ఉన్నంరెడ్డి ప్రకాష్ రెడ్డి, పల్లంరెడ్డి అనురాధ వద్ద సర్వే నెంబర్ 31లో ఉన్న 1.5 ఎకరాల భూమిని బాధితులు రూ. 6,00,000 కు బేరం కుదుర్చుకున్నారు.
ఇందులో భాగంగా రూ. 5,50,000 నగదును అప్పట్లోనే చెల్లించారు. మిగిలిన రూ. 50,000 రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే, వారు బంధువులు కావడంతో రిజిస్ట్రేషన్ విషయంలో కాలయాపన చేస్తూ వచ్చారు. 2015 నుండి బాధితులే సదరు భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే, ఇటీవల విచారించగా 2022లోనే పల్లంరెడ్డి అనురాధ ఆ భూమిని అనిల్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు పద్ధతిలో మార్పిడి చేసినట్లు వెల్లడైంది.
ఈ మోసాన్ని గమనించిన బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే, నిన్న సుమారు 30 మందిని వెంటబెట్టుకొని వచ్చి ఆ భూమిలో ఉన్న చెట్లను తొలగించి, ఫెన్సింగ్ రాళ్లను విరగ్గొట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడికి ప్రయత్నించి భయాందోళనకు గురిచేశారు. ఈ దౌర్జన్యంపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.




