Macherla: మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ సస్పెన్షన్.. ప్రేమజంటలను బెదిరించడమే పని!
Macherla: రక్షక భట నిలయమే భక్షక నిలయంగా మారిన వైనం మాచర్లలో వెలుగుచూసింది.
Macherla: మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్ సస్పెన్షన్.. ప్రేమజంటలను బెదిరించడమే పని!
Macherla: రక్షక భట నిలయమే భక్షక నిలయంగా మారిన వైనం మాచర్లలో వెలుగుచూసింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమజంటలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతున్న మాచర్ల ఏఎస్సై (ASI) శ్రీనివాస్‌పై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు.
మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే కాలేజీ విద్యార్థులు, ప్రేమికులే లక్ష్యంగా ఏఎస్సై శ్రీనివాస్ తన వల విసిరేవాడు. జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను నియమించుకుని, జంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీయించేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపించి "స్టేషన్‌కు పదండి" అంటూ భయపెట్టి అందినకాడికి డబ్బులు వసూలు చేసేవాడు.
డబ్బులు వసూలు చేయడమే కాకుండా, వీడియోలను సాకుగా చూపి యువతులు, మహిళలను తన కామ కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ వేధించేవాడని విచారణలో తేలింది. మాచర్లకు చెందిన ఓ వ్యాపారి ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోను సృష్టించి, వారిని భయపెట్టి పలు దఫాలుగా భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏఎస్సై నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బాధితుల ఫిర్యాదులు మరియు సోషల్ మీడియా ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఏఎస్సై దోషిగా తేలడంతో తక్షణమే సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇదే స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఎస్సై మరియు కానిస్టేబుల్ కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.




