Markapuram: మార్కాపురంలో విద్యుత్ ఘాతంతో టిప్పర్ లారీ దగ్ధం.. డ్రైవర్ సురక్షితం
Markapuram: మార్కాపురం మండలం శివరాంపురం వద్ద ఘోర ప్రమాదం. 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి మట్టి టిప్పర్ లారీ దగ్ధం. తృటిలో తప్పించుకున్న డ్రైవర్. రాత్రి వేళల్లో అక్రమ మట్టి రవాణాపై స్థానికుల ఆగ్రహం.
Markapuram: మార్కాపురంలో విద్యుత్ ఘాతంతో టిప్పర్ లారీ దగ్ధం.. డ్రైవర్ సురక్షితం
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం శివరాంపురం సమీపంలో ప్రమాదవశాత్తు మట్టి టిప్పర్ లారీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నికరంపల్లి వైపు నుంచి మట్టిని వెంచర్లకు తరలిస్తున్న లారీ, మట్టి అన్లోడ్ చేస్తుండగా హైడ్రాలిక్ పూర్తిగా దించకముందే ముందుకు కదలడంతో పైభాగంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. వెంటనే మంటలు చెలరేగి లారీని చుట్టుముట్టాయి. డీజిల్ ట్యాంకు లీక్ కావడంతో మంటలు మరింత తీవ్రంగా మారాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీ టైర్లు, డీజిల్ ట్యాంకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రాత్రివేళల్లో అక్రమంగా మట్టి రవాణా జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




