Srikakulam: నీలమణి దుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
Srikakulam: కాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51వ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Srikakulam: నీలమణి దుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో కొలువైయున్న ఉత్కలాంధ్రుళ ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్ర మహోత్సవములు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజులు వివిధ సంస్కృత కార్యక్రమాలు మరియు కబడ్డీ పోటీలు నిర్వహిస్తానని తెలిపారు.
ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులుతో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టి.వాసుదేవరావు,ఆలయ సిబ్బంది,ఆలయ కమిటీ చైర్మన్ అక్కంద్ర సన్యాసిరావు, తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




