Markapur: ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి.. కలెక్టర్ విజయ సునీత
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విజయ సునీత అధ్యక్షతన ‘జల ధార – జల హారతి’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది.
Markapur: ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి.. కలెక్టర్ విజయ సునీత
Markapur: మార్కాపురం జిల్లాలో నీటి సంరక్షణ, నిర్వహణపై మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు “జల ధార – జల హారతి” కార్యక్రమంపై మార్కాపురం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం మార్కాపురం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నీటి వనరును సంరక్షించడం, వర్షపు నీటి నిల్వలను పెంపొందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని, కార్యక్రమం అమలు విధానంపై సూచనలు చేశారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ తమ విభాగాల పరిధిలో చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.




