Markapur: ఘనంగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు పదవీ విరమణ సభ!

Markapur: మార్కాపురం డీఎస్పీ నాగరాజు పదవీ విరమణ సభ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై ఆయన సేవలను కొనియాడారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 Sept 2026 8:17 AM IST
Markapur
X

Markapur: ఘనంగా మార్కాపురం డీఎస్పీ నాగరాజు పదవీ విరమణ సభ!

Markapur: మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్‌లో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత,ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నాగరాజు ఏ హోదాలో, ఎక్కడ పనిచేసినా విధుల పట్ల పూర్తి నిబద్ధత, నీతి నిజాయితీతో వ్యవహరించారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు విశేష సేవలందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇన్‌ఛార్జి కందుల రామిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ తదితరులు పాల్గొని నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM