Markapur: డ్వాక్రా వ్యవస్థతోనే మహిళల అభివృద్ధి.. కందుల నారాయణరెడ్డి

Markapur: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డ్వాక్రా బజార్‌లో వివోఏలకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 April 2026 4:22 PM IST
Markapur
X

Markapur: డ్వాక్రా వ్యవస్థతోనే మహిళల అభివృద్ధి.. కందుల నారాయణరెడ్డి

Markapur: ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని ఎస్సి బీసీ కాలనీలో ఉన్న డ్వాక్రా బజార్లో నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాలకు చెందిన వివోఏలకు ప్రభుత్వం అందించిన చరవాణి లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం డ్వాక్రా వ్యవస్థను తీసుకువచ్చారని ఈ వ్యవస్థ లేకముందు మహిళలు ఎక్కువగా పొలం పనులు చేసే వారిని కానీ ఇప్పుడు డ్వాక్రా వ్యవస్థతో మహిళలు స్వయం శక్తితో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.

విజన్ 2020 అని మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు టెక్నాలజీని ప్రజలకు పరిచయం చేసి ప్రజా జీవితాలలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారని ఇప్పుడు విజన్ 2047 తో మరింత మెరుగైన అభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు శాఖ అధికారులు, వివోఏలు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story