Markapuram: తోకపల్లిలో కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి!

Markapuram: మార్కాపురం మండలం తోకపల్లిలో భార్యను బెదిరించేందుకు కన్నకొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి. మూడు గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 1:22 PM IST
Markapuram
X

Markapuram: తోకపల్లిలో కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి!

Markapuram: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఓ బాలుడి కిడ్నాప్‌కు దారితీశాయి. భార్యను బెదిరించేందుకు కన్నతండ్రే తన కుమారుడిని సినీ ఫక్కీలో అపహరించిన ఘటన పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలోని పునరావాస కాలనీలో చోటుచేసుకుంది.

సుంకేసుల గ్రామానికి చెందిన మార్తమ్మ తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పెద్దారవీడు ఎస్సై సైదుబాబు దర్యాప్తు చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్ కాల్స్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరిపి బాలుడిని అపహరించింది అతని తండ్రేనని నిర్ధారించారు.

భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థల నేపథ్యంలో భార్యను బెదిరించేందుకే తండ్రి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు వేగంగా స్పందించి కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM