Kurnool: పందికోన నీటి కోసం రైతుల సమర శంఖం.. దేవనకొండలో భారీ దీక్ష!

Kurnool: దేవనకొండలో పందికోన రిజర్వాయర్ పంట కాలువల సాధన కోసం కర్నూలు జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతులు భారీ దీక్ష చేపట్టారు.

G Jagadeesh, Pathikonda
Published on: 16 April 2026 7:46 PM IST
Kurnool
X

Kurnool: పందికోన నీటి కోసం రైతుల సమర శంఖం.. దేవనకొండలో భారీ దీక్ష!

Kurnool: దేవనకొండ పందికోన రిజర్వాయర్ పదు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ దాని పూర్తి లక్ష్యం నెరవేరలేదని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, కర్నూలు జిల్లా జలసాధన సమితి కన్వీనర్ శేషాద్రి రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి సిపిఎం జిల్లా నాయకులు బి. వీరశేఖర్ లు ఆరోపించారు.

దేవనకొండ బస్టాండ్ ప్రాంతంలో కర్నూలు జిల్లా జల సాధన సమితి ఆధ్వర్యంలో పందికోన రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువ సాధన సమితి అధ్యక్షులు కాశీనాథ్ యాదవ్ అధ్యక్షతన సాగునీటి సాధన దీక్ష చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పంట పొలాలకు పిల్ల కాలువలు పంట కాలంలో నిర్మాణం చేపట్టమని కర్నూలు జిల్లా జల సాధన సమితి గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తోందన్నారు. దీనిలో భాగంగానే గతంలో పత్తికొండలో పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేయడం జరిగిందన్నారు.

ఆ తర్వాత మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామకృష్ణుడు గారు హంద్రీ-నీవా పనులు పరిశీలనకు వచ్చినప్పుడు, పంట కాలువల నిర్మాణం గురించి ఆయనకు విన్న వించడం జరిగిందన్నారు. అంతేకాకుండా గత సంవత్సరం 25 గ్రామాలు పైగా పర్యటించి రైతుల నీళ్ల కష్టాలు గూర్చి వారి ద్వారానే అనేక వీడియోలు తీయించి పై అధికారులకు పంపడం జరిగిందన్నారు.అయినా ఈ విషయంలో ప్రభుత్వాలకు ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఇరిగేషన్ అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి ప్రతి సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపుతూ వస్తున్న కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.అందుకే ఈరోజు కర్నూలు జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో దేవనకొండ, గోనెగండ్ల, పత్తికొండ ఆస్పరి మండలాల రైతులతో పెద్ద ఎత్తున ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి రైతాంగ సాగునీటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నామన్నారు.

ప్రభుత్వం తమ ప్రాధాన్యతల ప్రకారం ఎన్నో చోట్ల ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ ఇలాంటి చిన్న, చిన్న కాలువ పనులకు డబ్బులు విదల్చకుండా రైతులను నరకయాతనకు గురిచేస్తోందన్నారు. ఇది ఎంతవరకు సబబు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రైతులు తమ గోడు వెల్ల బోసుకోవడానికి అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివచ్చారన్నారు.

ఈ దీక్ష శిబిరానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు శ్రీ బొజ్జ దశరథరామిరెడ్డి గారు విచ్చేసి తమ అమూల్య సందేశాన్ని రైతు సోదరులకు అందించారు.ఆతర్వాత ఆదోని రీజియన్ జలసాధన సమితి కన్వీనర్ శ్రీ కె. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఈ ప్రాంత రైతులు అనేక ఐక్య ఉద్యమాలు చేపట్టి తమ వాని వినిపిస్తారని ఎంత కష్టమైనా ఉద్యమాలు చేయడానికి వెనుకాడరని తద్వారా ఈ ప్రాంత సాగునీటి సమస్యలు తీరడానికి ఎల్లవేళలా శ్రమిస్తుంటామని మాట్లాడారు.

మా డిమాండ్లు: కుడి కాలువ ఆయకట్టు కింద ఉన్న 50,000 ఎకరాలకు పైగా ఉన్న పొలాలకు పంట కాలువలు నిర్మించి నీళ్లు అందించాలి. కర్నూలు బళ్లారి రోడ్డు మార్గంలో కరివేముల కప్పట్రాళ్ల మధ్య నీళ్లు ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్లడానికి కల్వర్టు నిర్మించాలి. తెర్నేకల్లు- పాలకుర్తి మధ్యలో చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రధాన కాలువ నిర్మాణం పనులు చేపట్టాలి. గోనెగండ్ల మండలంలోని ఆయకట్టు గ్రామాలన్నిటికి పిల్ల కాలవలు పంట కాలవలు నిర్మించి వెంటనే నీళ్లు విడుదల చేయాలి.

పందికోన రిజర్వాయర్ అవుట్లెట్ కన్నా ఇనెలేట్ చాలా చిన్నగా ఉంది. దాని సామర్ధ్యాన్ని పెంచి రిజర్వాయర్లో పూర్తి నీటిమట్టం నిర్వహించడానికి తగిన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ దీక్షా శిబిరంలో తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ కుమార్, అలారుదిన్నె నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కర్నూలు రామకృష్ణారెడ్డి,శేఖర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి ఎం.నరసరావు సిపిఎం జిల్లా నాయకులు బజారి, సిపిఐ నాయకులు శేఖర్, కృష్ణ, శ్రీనివాసులు,నాగేంద్ర ఇంకా అనేక గ్రామాల నుంచి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పిటిసిలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారని తెలిపారు. ఇలాంటి ఉద్యమాలు మరెన్ని చేపట్టాలని సమస్యలకు పరిష్కారం వచ్చేంతవరకు అహర్నిశలు కృషి చేయాలని ఉద్గాటించారు. ఈ మహత్తర ఉద్యమానికి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రాజకీయాలకతీతంగా అందరూ తమ పూర్తి మద్దతు అందించాలని జలసాధన సమితి నాయకులు విన్నవించారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story