Mummidivaram: ముమ్మిడివరంలో భారీ అగ్నిప్రమాదం కొబ్బరి గోడౌన్ భస్మీపటలం

Mummidivaram: ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని కొబ్బరి గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 July 2026 7:01 PM IST
Mummidivaram
X

Mummidivaram: ముమ్మిడివరంలో భారీ అగ్నిప్రమాదం కొబ్బరి గోడౌన్ భస్మీపటలం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

ముమ్మిడివరం నియోజకవర్గం..

రిపోర్టర్: ఎం సునీల్ శాస్త్రి

ముమ్మిడివరం మండలం కొత్తలం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీ హనుమాన్ ట్రేడర్స్‌కు చెందిన కొబ్బరి నిల్వ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా కొబ్బరికాయలు దగ్ధమయ్యాయి.

స్థానికులు సమాచారం అందించడంతో ముమ్మిడివరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోడౌన్ యజమాని మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేసి గోడౌన్‌లో నిల్వ ఉంచే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు కొబ్బరికాయలు నిల్వ ఉన్నాయని చెప్పారు.

ఈ అగ్నిప్రమాదంలో రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నామని, కొబ్బరి వ్యాపారమే తమ కుటుంబానికి ఏకైక జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story