Atmakur: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఏర్పాట్లను.. పరిశీలించిన ఆనం
Atmakur: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఆత్మకూరులో భారీ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
Atmakur: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఏర్పాట్లను.. పరిశీలించిన ఆనం
Atmakur: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నెల్లూరుపాలెం సమీపంలోని ఏఎంసీ ప్రాంగణంలో సీఎం 76వ జన్మదిన వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.సీఎం చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయుష్షు కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయుష్షు హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో, పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందించేందుకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో 23 మహిళా పొదుపు సంఘాలకు రూ.4.40 కోట్ల బ్యాంకు లింకేజి రుణాల జంబో చెక్కును అందజేయనున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేయడంతో పాటు, గర్భిణులకు సీమంతాలు ఘనంగా నిర్వహించేలా అంగన్వాడీ అధికారులు సిద్ధమయ్యారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్‌బుక్స్, పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారు. సిఆర్డిఏ ద్వారా 158 మంది వీఓఏలకు మొబైల్ ఫోన్లు అందజేయగున్నారు.మంత్రి ఆనం సొంత నిధులతో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు ట్రాక్‌సూట్లు పంపిణీ చేస్తారు.
రవాణా శాఖ ద్వారా వికలాంగులకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు రూ.2,72,698 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడంతో పాటు, ప్రమాదంలో మరణించిన టీడీపీ కుటుంబ సభ్యునికి చెందిన మర్రిపాడు మండలం భీమవరం గ్రామ కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మంత్రి ఆనం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.అదేవిధంగా దేవాదాయ శాఖ ద్వారా వివిధ పథకాల కింద ఆలయాల నిర్మాణాలకు, ధూప దీప నైవేద్యం ద్వారా ఆలయాలకు నిధులు మంజూరు పత్రాలు మంత్రి ఆనం పంపిణీ చేయనున్నారు.




